ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం
రాజంపేట : ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగానే అన్నమాచార్య యూనివర్సిటీ వెళ్తోందని యూనివర్సిటీ ప్రొచాన్స్‌లర్ చొప్పా అభిషేక్ రెడ్డి అన్నారు. శనివారం అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు కోడ్‌క్రాప్ట్ హాకథాన్‌లో విజయం సాధించిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడెట్రూ సంస్థ నుంచి లక్ష రూపాయలు బహుమతి, ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ రాజంపేటకు చెందిన ఐదుగురు విద్యార్థులు జాతీయస్థాయిలో నిర్వహించిన కోడ్‌క్రాప్ట్ హాకథాన్‌లో పాల్గొన్నారని, హ్యాండ్‌రైటింగ్ రికగ్నిషన్ సిస్టమ్ అనే ప్రాజెక్టును రూపొందించి ప్రతిభను చాటారన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సు, మెషిన్ లర్నింగ్ పద్ధతులను ఉపయోగించారన్నారు. ఈ ప్రాజెక్టును అభివృద్ది చేయడం ద్వారా ఆటోమేటెడ్ హ్యాండ్ రైటింగ్ గుర్తింపు వ్యవస్థను సమర్థవంతంగా రూపొందించారన్నారు. హాకథాన్‌లో కొత్త సమస్యలను పరిష్కరించే సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ది చేయడం, కోడింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడం అభినందనీయమన్నారు. సృజనాత్మక ఆలోచలను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయన్నారు. కోడెట్రూ సంస్థ ఈ హాకథాన్‌ను సాప్ట్‌వేర్ అభివృద్ది, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగిన యువప్రతిభావంతులను గుర్తించేందుకు నిర్వహించిందన్నారు. ఈ సంస్థకు టాంపా, చికాగో, హైదరాబాద్ నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయన్నారు. కోడ్‌ట్రూ ఉత్తమ టెక్నికల్ నైపుణ్యం కల్గిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి పరిశ్రమ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తమ కళాశాల విద్యార్థులు హాకథాన్‌లో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని వారన్నారు. విజేతల బృందం సభ్యులు కున్ననన్ రెడ్డి, చిట్టేపు ఆనంద గోపాల్ రెడ్డి, మానే యనమల అఖిల్ కుమార్ రెడ్డి, గుబగుండ మహేంద్ర, మేక మనోజ్‌లు ఉన్నారని, వీరి ప్రతిభను గుర్తించి కోడ్ ట్రూ సంస్థ లక్ష రూపాయలు నగదు బహుమతిని అందజేసిందన్నారు. అంతే కాకుండా ఈ విద్యార్థులకు సంస్థ నుంచి ఉద్యోగ అవకాశాలు కూడా ప్రకటించిందన్నారు. తమ కళాశాల విద్యార్థులు హాకథాన్‌లో ప్రదర్శించిన సాంకేతిక నైపుణ్యాన్ని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా గుర్తించి, అధిక వేతనంతో ఉద్యోగ అవకాశాలను కల్పించిందన్నారు. కార్యక్రమంలో అన్నమాచార్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఈ సాయిబాబా రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్ మల్లికార్జున రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్‌ఎంవీ నారాయణ, సిఎస్‌ఈ విభాగాధిపతి డాక్టర్ ఎం సుబ్బారావు. డాక్టర్ బి జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యూనివర్సిటీ ప్రోచాన్స్‌లర్ చొప్పా అభిషేక్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment