డిజిటల్ సాధనాలతో విద్యాబోధన
మదనపల్లె : డిజిటల్ సాధనాలతో విద్యాబోధన చేయడం ద్వారా విద్యార్థులకు విషయజ్ఞానం పెరుగుతుందని ఉన్నత విద్యామండలి అకడమిక్ ఆఫీసర్ శ్రీరంగం మాథ్యూ అన్నారు. పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో రెండురోజులుగా జరుగుతున్న వర్క్‌షాప్ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా శ్రీరంగం మాథ్యూ మాట్లాడుతూ బోధన సందర్భంగా వీలైనంతవరకు విద్యార్థుల నుంచి సమాధానాలను రప్పించే ప్రయత్నంచేసి వారి భాగస్వామ్యాన్ని అందులో పెంచడం ముఖ్యమన్నారు. బోధనలో వినూత్నపద్దతులు వాడాలని, చాక్‌పీస్, మాట్లాడటం కాదని తెలిపారు. స్వీయ, వేగవంతమైన అభ్యాసం విద్యార్థులకు అలవాటు చేయడం చాలా మంచిదన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు, సహ పాఠ్య కార్యకలాపాలు ముఖ్యమని, పరిశోధనలు, వృత్తి సంస్థలు, ఇంటర్నషిప్ మొదలైనవన్నారు. విద్యార్థులకు ముఖ్యంగా నైపుణ్య కోర్సులపై శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు అందించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా శ్రీరంగం మాథ్యూను కరస్పాండెంట్ డాక్టర్.రాటకొండ గురుప్రసాద్, ప్రిన్సిపాల్ సురభి రమాదేవి, అధ్యాపకులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment