అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
సిద్దవటం : మండలంలోని తురకపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న ఎల్లకూరి చంద్రశేఖర్‌రెడ్డి (36) అనే వ్యక్తి అప్పుల బాధతో మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం చాముండేశ్వరిపేట గ్రామానికి చెందిన ఎల్లకూరి చంద్రశేఖర్‌రెడ్డి ఆరేళ్ల నుంచి కడపకు చెందిన తోట నాగార్జున తురకపల్లెలో నిర్మించిన వెంగమాంబ సిమెంటు ఇటుకల తయారీ కేంద్రంలో వాచ్‌మెన్, డ్రైవర్‌గా పనిచేసేవాడు. కడపకు చెందిన షేక్ షబానాను భర్త వదిలేయడంతో చంద్రశేఖర్‌రెడ్డి ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇతను భార్య షేక్ షబానా, ఆమె మొదటి భర్త కుమారుడు మస్తాన్‌వలీతో కలిసి తురకపల్లిలో నివాసం ఉంటున్నాడు. మృతుడి యజమాని వద్ద రూ. 2లక్షలు అప్పు తీసుకున్నాడు. మంగళవారం ఉదయం బాత్‌రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి ఎంతసేపటికి రాక పోవడంతో భార్య షబానా అక్కడికి వెళ్లి చూసింది. అయితే అప్పటికే చీరతో ఉరివేసుకుని ఉన్నాడు. వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చి ఆమె కుమారుడి సాయంతో మృతదేహాన్ని కిందకు దింపారు. మృతుడి తల్లి మల్లేశ్వరమ్మ కుమారుడి మృతదేహాన్ని చూసి తన కుమారుడికి మద్యం తాగే అలవాటు ఉందని, భార్యతో గొడవ పడేవాడని తెలిపింది. ఈ సంఘటనపై విచారించి న్యాయం చేయాలని సిద్దవటం ఇన్‌చార్జి ఎస్‌ఐ శివప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment