రైల్వే మంత్రి దృష్టికి రైళ్ల హాల్టింగ్ సమస్య
రాజంపేట : రాజంపేట, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, నందలూరు తదితర రైల్వే స్టేషన్‌లలో రైళ్ల హాల్టింగ్స్ విషయాన్ని మంగళవారం రైల్వే మంత్రి అశ్వినిౖ వెష్ణవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో దేశ రాజధానికి వెళ్లే ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, తిరుపతి– కొల్హాపూర్ మధ్య నడిచే హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్ సౌకర్యం త్వరగా కల్పించాలని కోరామన్నారు. అలాగే రైల్వేకోడూరులో హరిప్రియ, ఎంజీఆర్ చైన్నె ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్డింగ్ ఇవ్వాలన్నారు. జిల్లాలో రైల్వే పరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వే కేంద్రానికి పూర్వ వైభవం కల్పించాలన్నారు. తిరుపతి–హుబ్లీ ప్యాసింజర్ రైలును బ్రిటీష్ కాలం నాటి రెడ్డిపల్లె రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని కోరినట్లు తెలిపారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు.
ఎంపీ మిథున్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment