●క్లస్టర్‌తో ఉద్యోగుల కోత
రెండు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్‌గా చేస్తున్న ప్రభుత్వం సాంకేతిక విభాగం కింద పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒక క్లస్టర్ పరిధిలో రెండు సచివాలయాలు ఉంటే.. అందులో రెండు సచివాలయాల్లో పని చేస్తున్న సాధారణ పరిపాలన ఉద్యోగులు ఐదుగురు యథావిధిగా ఉంటారు. అయితే సాంకేతిక విభాగానికి చెందిన ఏడుగురు ఉద్యోగులు మాత్రమే విధుల్లో ఉండే అవకాశం ఉంటుంది. రెండు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఒక సచివాలయ ఉద్యోగులను తగ్గించి రెండు సచివాలయ బాధ్యతలను ఒక ఉద్యోగికి అప్పగించేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో ఒక సచివాలయానికి చెందిన ఏడుగురు ఉద్యోగులను బాధ్యతల నుంచి తప్పించినట్టవుతుంది. తద్వారా సచివాలయ వ్యవస్థకు జిల్లాలో 1,757 మంది ఉద్యోగులను దూరం చేసే అవకాశం ఉంది. ఈ ప్రభావం ప్రజలకు అందించే క్షేత్రస్థాయి సేవలపై తీవ్రప్రభావం చూపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment