రోడ్డు ప్రమాదంలో దుస్తుల వ్యాపారి దుర్మరణం
కురబలకోట ; కడప నగరంలోని జెడ్‌ఆర్ ఫ్యాషన్ వరల్డ్ నిర్వాహకుడు షేక్ జహీర్ (28) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో జరిగిన ఈ విషాదకర సంఘటనకు సంబంధించి ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ కథనం మేరకు.. కడప నగరానికి చెందిన జహీర్ రెండేళ్లుగా కడపలో జెడ్‌ఆర్ ఫ్యాషన్ వరల్డ్ పేరిట రెడీమేడ్ దుస్తుల షాపు నిర్వహిస్తున్నాడు. గతంలో ట్రావెల్స్‌లో పనిచేసేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు సంతానం. భార్య ప్రస్తుతం గర్భిణి. రంజాన్ సందర్భంగా విక్రయానికి అవసరమైన దుస్తులు కొనుగోలు చేసేందుకు తమ్ముడు షమీర్ (26)తో కలిసి షేక్ జహీర్ కారులో బెంగళూరు బయలుదేరాడు. తనే కారు నడుపుకుంటూ వస్తుండగా కురబలకోట మండలంలోని మధ్యాహ్నంవారిపల్లె–రామిగానిపల్లె మధ్యలో మదనపల్లె–2 డిపోకు చెందిన గాలివీడు ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చింది. ప్రమాదవశాత్తు బస్సును కారు ఢీకొంది. ఈ సంఘటనలో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తమ్ముడు షమీర్ కారులో వెనుక సీట్లో ఉండడంతో గాయాలతో బయటపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం జహీర్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.
మృతుడిపైనే కేసు.!
ఇదిలా ఉండగా ప్రమాదానికి మృతుడు జహీర్ కారణమని కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్న జహీర్ కారును నిద్రమత్తులో అదుపు చేయలేక వేగంగా బస్సును ఢీ కొట్టడం వల్లే ఈ సంఘటన జరిగినట్లు అటు విచారణలోను ఇటు సంఘటన స్థల పరిశీలనలోను వెల్లడైందన్నారు. చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం ఇదేమి.. విచిత్రం స్వామీ అంటూ పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.
మృతుడి స్వస్థలం కడప
బెంగళూరుకు వెళుతుండగా దుర్ఘటన
రోడ్డు ప్రమాదంలో దుస్తుల వ్యాపారి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో దుస్తుల వ్యాపారి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో దుస్తుల వ్యాపారి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment