
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉగాది సంబరాలు
రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విశ్వావసు నామ ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉగాది పర్వదినం సందర్భంగా ఎస్పీ సతీ సమేతంగా వేడుకలలో పాల్గొని పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఎస్పీ దంపతులు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక పూజలలో పాల్గొని పోలీసు అధికారులకు సిబ్బందికి ఉగాది పచ్చడి, ప్రసాదం అందజేసి ఉగాది భోజనాలు వడ్డించారు.
రంజాన్ పండుగ శుభాకాంక్షలు..
పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలు సంతృప్తి, సంతోషాలతో జరుపుకోవాలని, రంజాన్ పర్వదినాన శాంతి, ప్రేమ, ఐక్యతకు ప్రతీకగా నిలవాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
స్పందన రద్దు..
రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31వ తేదీ సోమవారం సెలవు దినంగా ప్రకటించింది. అందువలన జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు వీజే రామకృష్ణ, ఎం.పెద్దయ్య, రాయచోటి అర్బన్ సీఐ జి.చలపతి, ట్రాఫిక్ సీఐ ఎస్.విశ్వనాథ రెడ్డి, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పాల్గొన్న జిల్లా ఎస్పీ దంపతులు
రంజాన్ పండుగ శుభాకాంక్షలు