
కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు చేసిందేమీ లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయి బీసీ విభాగం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ జిల్లా నుంచి బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు శివరామ్‌తోపాటు పలువురు బీసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ విభాగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, పార్టీని ఎలా పటిష్టం చేయాలనే అంశాలపై బీసీ నేతలు దిశానిర్దేశం చేశారని, తదనుగుణంగా రాబోయే రోజుల్లో జిల్లా బీసీ విభాగం పనిచేస్తుందని తెలిపారు. త్వరలోనే జిల్లా, మండల కమిటీలు పూర్తి చేసి, కూటమి ప్రభుత్వంలో బీసీలకు జరిగే అన్యాయాలు, టీడీపీ వారు చేసే అక్రమాలను బయటపెడతామన్నారు.