శాంతి ఆయుధంగా ముందుకు సాగిన మహాత్ముడు
పట్నంబజారు: విప్లవం, హింస లేకుండా శాంతియుతంగానే ఏదైనా సాధించవచ్చని చాటి చెప్పిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కీర్తించారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం గాంధీజీ వర్ధంతిని పురస్కరించుని ఆయన చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, నగర డిప్యూటీ మేయర్, పార్టీ నగర అధ్యక్షుడు వనమా బాలవజ్రబాబు (డైమండ్‌బాబు), తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మానవాళికి మంచిగా మెలగటాన్ని నిర్దేశించిన ఘనత బాపూజీదేనన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడిచి, అహింసా మార్గంలో ముందుకు సాగాలన్నారు. మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. భావితరాలకు గాంధీ విలువలను తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ అంటేనే ఒక గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, పోలూరి వెంకటరెడ్డి, నందేటి రాజేష్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండేపూడి పురుషోత్తం, కొత్తా చిన్నపరెడ్డి, మామిడి రాము, ఆవుల సుందర్‌రెడ్డి, బత్తుల దేవానంద్, బైరెడ్డి రవీంద్రారెడ్డి, బొర్రా వెంకటేశ్వరరెడ్డి, రాచకొండ ముత్యాల రాజు, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి, రోషన్, మర్రి అంజలి, అంబేడ్కర్, దూపాటి వంశీ, అచ్చాల వెంకటరెడ్డి, బూసి రాజలత, మర్రి సత్యన్నారాయణ, పార్టీ నేతలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment