యల్లమంద, చినతురకపాలెంలో కలెక్టర్ పర్యటన
నరసరావుపేట రూరల్: మండలంలోని యల్లమంద, చినతురకపాలెం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు గురువారం పర్యటించారు. చినతురకపాలెంలోని గొనె సంచుల తయారీ యూనిట్లను సందర్శించారు. కార్మికుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గొనె సంచుల తయారీ మిషన్ల ఏర్పాటుకు గ్రూపులుగా ఏర్పడితే రూ.10లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. గ్రామంలోని ఊర్దూ పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌కు 8వ తరగతి వరకే బోధన చేస్తున్నారని, 9, 10వ తరగతులు ప్రారంభించాలని గ్రామస్తులు విన్నవించారు. చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి సమాధానం ఇచ్చారు. యల్లమందలో గృహ నిర్మాణాలను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలోని కల్యాణ మండపాన్ని నిధులు కేటాయించి, పూర్తిచేయాలని గ్రామస్తులు కోరారు. కల్యాణ మండపాన్ని పరిశీలించిన కలెక్టర్ అంచనాలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాధవిలత, డీఆర్డీఏ పీడీ బాలునాయక్, ఎల్డీఎం రాంప్రసాద్, నైపుణ్యాభివృద్ధి శాఖాధికారి తమ్మాజిరావు, తహాసీల్దార్ వేణుగోపాలరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment