శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
రేపల్లె రూరల్: మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన శెవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం రేపల్లె ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఎస్.సునీల్ కుమార్ తెలిపారు. స్థానిక డిపో గ్యారేజీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శివరాత్రి సందర్భంగా రేపల్లె నుంచి గోవాడకు 10, కోటప్పకొండకు 15, అరవపల్లి బాలకోటేశ్వర స్వామి సన్నిధికి రెండు ప్రత్యేక సర్వీసుల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. సర్వీసులను తిరునాళ్ల సందర్భంగా ఉదయం నుంచి నిరంతరం తిప్పటం జరుగుతుందని, భక్తులు ఈ సర్వీసులను వినియోగించుకుని ఆర్టీసీ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.
పురస్కారానికి వడలి రాధాకృష్ణ ఎంపిక
చీరాల అర్బన్: కథా రచయిత, చీరాల సహజ సాహితి వ్యవస్థాపక అధ్యక్షుడు వడలి రాధాకృష్ణను పొద్దుటూరుకు చెందిన సాహితీ నిర్వాహక సంస్థ ఈ సంవత్సరపు కొనిరెడ్డి ఫౌండేషన్, చదువుల సాహిత్య వేదిక విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, సాహితీవేత్త డీకే చదువుల బాబు సోమవారం తెలిపారు. మూడు దశాబ్దాలుగా కథా సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు. 700కు పైగా సామాజిక ఇతివృత్త కథలను రచించారు. మార్చి 8న ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు వడలి రాధాకృష్ణ తెలిపారు. చీరాల ప్రముఖులు బత్తుల బ్రహ్మారెడ్డి, కోడూరి ఏకాంబరేశ్వరబాబు, బీరం సుందరరావు, వలివేటి మురళీకృష్ణ, వూర మస్తాన్‌రావు, ఎ.నాగవీరభద్రాచారి, తిరుమలశెట్టి సాంబశివరావు, భాగి కృష్ణమూర్తి, మంత్రి కృష్ణమోహన్‌లు హర్షం వ్యక్తం చేశారు.
షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పైరు దగ్ధం
అద్దంకి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మొక్క జొన్న పైరు దగ్ధమైన సంఘటన సోమవారం మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలో జరిగింది. ఫైర్ స్టేషన్ సిబ్బంది అందించిన సమాచారం మేరకు..మండలంలోని బొమ్మనంపాడు గ్రామానికి చెందిన గొట్టిపాటి చిరంజీవి తన పొలంలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. అందులో బోరు వేసి విద్యుత్ కనెక్షన్‌తో మోటారు బిగించాడు. ప్రమాదవశాత్తు విద్యుత్‌షార్టు సర్క్యట్ కావడంతో పంటకు నిప్పంటుకుని కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే రైతుకు రూ.20వేల వరకు నష్టం వాటిల్లింది.
శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
Comments
Please login to add a commentAdd a comment