ప్రకా‘శివ’ంతం
అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయాన్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. రాజగోపురంపై విద్యుద్దీప కాంతుల్లో తళుకులీనుతున్న పార్వతీ పరమేశ్వరుల అలంకరణ భక్తులను విశేషంగా అకట్టుకుంది.
– అమరావతి
కేఎస్‌కు వైఎస్సార్ టీఎఫ్ మద్దతు
గుంటూరు ఎడ్యుకేషన్: ఈనెల 27న జరగనున్న కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ తరపున పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌పీ సాగర్ సోమవారం ఓప్రకటనలో తెలిపారు. ఫెడరేషన్ రాష్ట్ర నాయకుల సూచన మేరకు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో భాగంగా గుంటూరు, కృష్ణా జిల్లాల అధ్యక్షులు వై.ధామస్‌రెడ్డి, మహంకాళిరావు, ఇతర నాయకుల సమక్షంలో కేఎస్ లక్ష్మణరావుకు మద్దతు ప్రకటిస్తూ, తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment