కొడుకు మృతి కారకులపై కేసు నమోదు చేయండి
నరసరావుపేట: తమ కుమారుడు మృతికి కారకులైన కోడలు, ఆమె తల్లిదండ్రులు, ఆమెతో వివాహేతర సంబందం పెట్టుకున్న వ్యక్తిపై కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని మృతుని తల్లితండ్రులు, బంధువులు కోరారు. ఈ మేరకు ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించేందుకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వారి కథనం ప్రకారం.. కారెంపూడి మండలం పేటసన్నెగండ్ల తండావాసి బాణావత్ నాగేశ్వరరావు నాయక్ కుమారుడు గోపీనాయక్(34)కు 14 ఏళ్ల క్రితం తన చెల్లెలు కుమార్తెతో పెళ్లి జరిపించాడు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. కోడలు పేటసన్నెగండ్లకు చెందిన కాసుల కుమారుడు షేక్ కరిముల్లాతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పలుమార్లు హెచ్చరించారు. పెద్దమనుషులు సమక్షంలో పంచాయితీ జరిగినా ఆమెలో మార్పులేదు. గోపీనాయక్‌ను చంపి అడ్డం తొలగించుకోవాలనే ఉద్దేశంతో కోడలు, ఆమె ప్రియుడు, ఆమె తల్లిదండ్రులు పథకం రచించి కారెంపూడి వెళ్లి పురుగుమందుల డబ్బా కొని తీసుకొచ్చి గతేడాది సెప్టెంబరు 27న గోపీనాయక్‌కు స్పిరిట్‌లో కలిపి ఇచ్చారు. దీంతో వాంతులు చేసుకుంటున్న గోపీనాయక్‌ను గుంటూరులోని ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించగా పరిస్థితి విషమించి అక్టోబర్ 1న మరణించాడు. దీనిపై కారెంపూడి పోలీసులకు గోపీనాయక్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయినా నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికై నా పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తుచేయాలని గోపీనాయక్ తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఎస్పీకి తల్లిదండ్రులు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment