సౌత్‌జోన్ నేషనల్ షూటింగ్ బాల్ పోటీల్లో ఏపీ విజయం
యడ్లపాడు: సౌత్‌జోన్ నేషనల్ షూటింగ్‌బాల్ పోటీల్లో ఏపీ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఈనెల 22, 23 తేదీల్లో బాపట్ల మండలం చిమ్మిరిబండ గ్రామంలో సౌత్‌జోన్ నేషనల్ షూటింగ్‌బాల్ బాలుర, బాలికల విభాగాల్లో జాతీయస్థాయి పోటీలను నిర్వహించారు. ఆయా పోటీల్లో ఆరురాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ బాలికల విభాగంలో తెలంగాణపై రెండు– సున్నా తేడాతో విజయం సాధించి మొదటి స్థానాన్ని కై వసం చేసుకుంది.
మరిన్ని విజయాలు సాధించాలి...
యడ్లపాడు గ్రామం పైపల్లె (ఎస్సీకాలనీ)కి చెందిన కోడిరెక్క అన్నమ్మ కుమార్తెల్లో కోడిరెక్క ధనలక్ష్మి ఏపీ బాలికల జట్టు కెప్టెన్‌గా వ్యవహరించగా ఆమె సోదరి కోడిరెక్క పాప సభ్యురాలిగా సత్తాచాటింది. ఈ సందర్భంగా బోయపాలెం విశ్వతేజ నూలుమిల్లు ఎండీ దాసరి చంద్రశేఖర్ సోమవారం అక్కాచెల్లెళ్లు ఇద్దరినీ అభినందించారు. గతంలో కెప్టెన్ ధనలక్ష్మికి రూ.55వేలు ఆర్థికసాయం అందించామని, ఈసారి అక్కాచెల్లెళ్లకు బీటెక్, డిగ్రీలలో చేరేందుకు కళాశాలల ఫీజులను చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
జట్టులో యడ్లపాడు పైపల్లె అక్కాచెల్లెళ్లు
Comments
Please login to add a commentAdd a comment