బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా తిరుపతిరావు
గుంటూరు మెడికల్: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా చెరుకూరి తిరుపతిరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు లాల్‌పురం రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయం వాజ్‌పాయ్ భవన్‌లో జిల్లా పరిశీలకుడు శ్రీనివాసరాజు, ఎలక్షన్ ఆఫీసర్ చిగురుపాటి కుమారస్వామి, బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజుల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా చెరుకూరి తిరుపతిరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిగా తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషిచేస్తానని వెల్లడించారు. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేసే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు జమ్ముల శ్యామ్ కిషోర్, నేరెళ్ల మాధవరావు, కొత్తూరి వెంకట సుబ్బారావు, మకుటం శివ, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ, యడ్లపాటి స్వరూపరాణి, ఈదర శ్రీనివాసరెడ్డి, టుబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్, డాక్టర్ శనక్కాయల ఉమా శంకర్, జిల్లా పదాధికారులు తదితరులు పాల్గొని తిరుపతిరావుకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment