గుంటూరు రేంజ్‌కు 53 మంది ప్రొబేషనరీ ఎస్‌ఐలు
నగరంపాలెం: సమర్థంగా విధులు నిర్వర్తించాలని, విధి నిర్వహణలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ప్రొబేషనరీ ఎస్‌ఐలకు సూచించారు. శిక్షణ పూర్తయి, గుంటూరు రేంజ్ పరిధిలో విధుల నిర్వహించేందుకు ఎంపికై న 53 (36 మంది పురుషులు, 17 మంది మహిళలు) మంది ప్రొబేషనరీ ఎస్‌ఐలు ఆదివారం గుంటూరు నగరంలోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిజాయతీ, పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని తెలిపారు. అనంతరం జిల్లాలు కేటాయిస్తూ నియామక ఉత్తర్వులను ఐజీ అందించారు. గుంటూరు జిల్లాకు 22 మంది, పల్నాడు జిల్లాకు 13, బాపట్ల జిల్లాకు 10, ప్రకాశం జిల్లాకు ఒకరు, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాకు ముగ్గురు, తిరుపతి జిల్లాకు నలుగురిని కేటాయించారు. ఈనెల 2వ తేదీ నుంచి 6 వరకు పీఎస్‌ఐలకు సెలవులని ఐజీ తెలిపారు. అనంతరం ఈనెల 7వ తేదీ నుంచి గ్రేహౌండ్స్ శిక్షణకు పంపిస్తామని వెల్లడించారు. అనంతరం పీఎస్‌ఐలతో ఐజీ మాట్లాడారు.
జిల్లాల వారీగా కేటాయింపులు నియామక ఉత్తర్వులు జారీచేసిన రేంజ్ ఐజీ
Comments
Please login to add a commentAdd a comment