పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
నరసరావుపేట ఈస్ట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆయా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోని విద్యాసంస్థల్లో మహిళల భద్రత, హక్కులు, సాధికారిత, మహిళా చట్టాలు, ఫోక్సో చట్టం, ఈవ్ టీజింగ్ తదితర అంశాలపై ఈ పోటీలను నిర్వహించారు. పోటీల అనంతరం స్టేషన్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో విద్యార్థినులతో సమావేశాలను ఏర్పాటు చేసి మహిళల రక్షణకు పోలీస్‌శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. అత్యవసర సమయంలో సహాయం కోసం హెల్ప్‌లైన్ నెంబర్లు చైల్డ్ 1098, ఉమెన్ 181, పోలీస్ 112, సైబర్ క్రైమ్ 1930 నెంబర్లకు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment