చెరుకుపల్లి: మండలంలోని ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి యత్నం కేసులో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని రేపల్లె డీఎస్పీ ఆవల శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం ఆరేపల్లి పంచాయతీ పరిధిలో చిన్నారిపై లైంగిక దాడి యత్నం కేసులో భాగంగా డీఎస్పీ సోమవారం గ్రామంలో పర్యటించి స్థానిక వీఆర్వో శివ నాగేశ్వరరావు సమక్షంలో చిన్నారి కుటుంబ సభ్యులను విచారించారు. వివరాలు అడిగి తెలుసుకొని నమోదు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ ఘటనపై ఇప్పటికే క్లూస్ టీమ్ ఆధారాలు, వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా కేసుపై తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. డీఎస్పీ వెంట స్థానిక ఎస్సై టి.అనీల్‌కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment