సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు
రేపల్లె రూరల్: సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దటంలో ప్రతి ఒక్కరూ సహకారం ఎంతో అవసరమని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ బాపట్ల జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు చెప్పారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మండలంలోని గుడ్డికాయలంక గ్రామంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నాటుసారా తయారీ, విక్రయాలను సమూలంగా రూపుమాపేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. నాటుసారా తయారు చేసినా, విక్రయాలు జరిపినా నేరమని తెలిపారు. నాటుసారా సేవనంతో అనేక దుష్పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత కాలంలో యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ జీవితాలను పాడుచేసుకుంటోందన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులు ఎటువంటి దుర్వసనముల పాలు కాకుండా ఉండేలా ఉండాలంటే ముందు తాము సత్పప్రవర్తనతో కూడిన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. గ్రామంలో నాటుసారా తీసుకోవటంతో కలిగే నష్టాలను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రేపల్లెలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయం తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో రేపల్లె ఎకై ్సజ్ సీఐ దివాకర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రామారావు, ఎస్‌ఐ రాజశ్రీ, వీఆర్వో హరీష్, మహిళా పోలీసు శ్రావణి, పేరం విష్ణు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment