
సొన చిదిమేశారు
బాపట్ల
పోలీసుల స్వచ్ఛ భారత్
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం పోలీసులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్టేషన్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు.
గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025
ఇఫ్తార్ సహర్
(గురు) (శుక్ర)
నరసరావుపేట 6.23 5.07
గుంటూరు 6.21 5.05
బాపట్ల 6.21 5.05
చీరాల: వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామం వద్ద బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న 111 ఎకరాల ప్రభుత్వ సొన పోరంబోకు భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములను కొందరు కబ్జా చేసి దొంగ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు. ప్లాట్లుగా వేసి అమ్మేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ పాపంలో వారికీ భాగస్వామ్యం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూముల విలువ రూ.వంద కోట్లపైమాటేనని స్థానికులు చెబుతున్నారు.
అసలు ఏం జరిగిందంటే..
చల్లారెడ్డిపాలెం వద్ద బైపాస్ రోడ్డును ఆనుకకుని సర్వే నంబర్ 59లో ఉన్న సొన పోరంబోకు భూమిని కొందరు తహసీల్దార్‌లు 1.2, 3, 4, 5, 6.7, 8, 9, 10, 11 సబ్ డివిజన్‌లగా విభజించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఇందులో 18 ఎకరాల భూమిని 1956లో అప్పటి రెవెన్యూ అధికారులు ఏ–డబ్ల్యూ కిందకి కన్వర్షన్ చేసి కొంత మందికి పట్టాలు ఇచ్చారు. మిగిలిన 93 ఎకరాలను 1993లో 83 భిన్నాలుగా విభజించారు. అధికారులు వారి స్వలాభం కోసమే వీటిని విభజించినట్టు విమర్శలు ఉన్నాయి. సబ్‌డివిజన్ చేసిన సర్వే నంబర్లతోపాటు విస్తీర్ణానికి సబంధించిన రికార్డులను ఆ పరిధిలోని చీరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపాల్సి ఉన్నా.. అప్పటి అధికారులు పట్టించుకోలేదు. రికార్డులు రిజిస్ట్రార్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో కొందరు అవి తమ పూర్వీకుల భూములని చెప్పి విలేజ్ సర్వేయర్లు, వీఆర్‌ఓల వద్ద ఎన్‌ఓసీ తీసుకుని దొంగ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.
తవ్వేకొద్దీ రెవెన్యూ అక్రమాలు
వేటపాలెం మండల పరిధిలోని భూ అక్రమాలు ప్రస్తుత సర్వేలో తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ఈ మండలంలో ప్రభుత్వ అసైన్డ్, సొన పోరంబోకు, డ్రెయినేజీ పోరంబోకు, కుందేరు పొరంబోకు వంటి ప్రభుత్వ భూములు వేల ఎకరాల్లో అన్యాక్రాంతమయ్యాయి. కుందేరు పోరంబోకు భూములను ఆక్రమించిన అక్రమార్కులు రొయ్యల చెరువులు సాగు చేశారు. డ్రెయినేజీ, సొన పోరంబోకు భూముల్లో సేద్యం చేసుకుంటున్నారు.
సొన బోరంబోకు భూమిలో లేఅవుట్‌లు
బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న సొన పోరంబోకు భూముల్లో అక్రమార్కులు లేఅవుట్‌లు వేసి సెంటు రూ.3 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. ఈ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడితే అక్రమాలన్నీ బయటపడతాయి.
సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే..
సొన పోరంబోకు, శ్మశానం పోరంబోకు, డ్రెయినేజీ పోరంబోకు భూములపై ప్రైవేటు వ్యక్తులకు ఎటువంటి హక్కులూ ఉండవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చినా చెల్లుబాటు కావని అనేకమార్లు స్పష్టం చేసింది.
న్యూస్‌రీల్
పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం
నేను ఇటీవలే బదిలీపై వేటపాలెం తహసీల్దార్‌గా వచ్చాను. ఆ భూమిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఏ మేరకు అక్రమాలు జరిగాయో పరిశీలించి నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాను.
– పార్వతి, తహసీల్దార్, వేటపాలెం
సొన పోరంబోకు భూమి హాంఫట్
విలువ రూ.వంద కోట్లపైమాటే..!
ఒక్కో ఎకరం రూ.కోటిన్నరపైనే
దొంగ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు
ప్లాట్లుగా వేసి విక్రయం
రెవెన్యూ అదికారులు,
సిబ్బందికి భారీగా ముడుపులు

సొన చిదిమేశారు

సొన చిదిమేశారు

సొన చిదిమేశారు

సొన చిదిమేశారు
Comments
Please login to add a commentAdd a comment