తపాలా బీమా.. కుటుంబానికి ధీమా
వేటపాలెం: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్‌ఐ) పథకం గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించేది. ప్రస్తుతం పట్టభద్రులకు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అనేక మంది ఉద్యోగులు పథకంలో చేరి లబ్ధి పొందుతున్నారు. బీటెక్, ఎంటెక్, బీఈడీ, ఎంఈడీ, బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంబీబీఎస్, బీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, డిప్లమా వంటి కోర్సులతో పాటు అన్ని విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చేసిన విద్యార్థులు ఈ పాలసీకి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. 19 – 55 ఏళ్ల మధ్య వయస్సు గల వారు అర్హులు.
ప్రయోజనాలు ఇవీ..
● పాలసీ అంగీకరించిన తేదీ నుంచి పూర్తి జీవిత బీమా సౌకర్యం
● ప్రీమియాన్ని దేశవ్యాప్తంగా ఏ పోస్టాఫీసులోనైనా చెల్లించే వెసులుబాటు
● ఐపీపీబీ, పోస్ట్ ఇన్‌ఫో యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం
● ల్యాప్స్ (చెల్లని) పాలసీలను నిబంధనల ప్రకారం అధికారులను సంప్రదించి పునరుద్ధరించుకోవచ్చు.
● ఒక ఏడాది ప్రీమియం ముందే చెల్లించిన వారికి 2 శాతం రిబేటు సౌకర్యం
● ఒక్కో వ్యక్తి రూ.50 లక్షల వరకు ఎన్ని పాలసీలైనా తీసుకోవచ్చు.
● ఆదాయపు పన్ను మినహాయింపు.
● ఇతర బీమా పాలసీల కంటే ప్రీమియం తక్కువ, బోనస్ అధికంగా పొందే అవకాశం.
● పాలసీదారులు మరణిస్తే పాలసీ విలువతో పాటు అప్పటివరకు జమైన బోనస్‌ను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్ని పోస్టాఫీసుల్లో పాలసీ చేసుకోవచ్చు. వివరాలకు పోస్టల్ అధికారులను సంప్రదించాలి. స్కీం గురించి మరింత మందికి అవగాహన కల్పించి భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నాం.
– శ్రీనివాసరావు, పోస్టుమాస్టర్, రావూరిపేట
ఉద్యోగులు, పట్టభద్రుల
కుటుంబాలకు భరోసా
తపాలా బీమా.. కుటుంబానికి ధీమా
Comments
Please login to add a commentAdd a comment