రేపు జాతీయ లోక్‌అదాలత్
రేపల్లె రూరల్: పట్టణంలోని సబ్‌కోర్టు హాలులో శనివారం నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ టీ.వెంకటేశ్వర్లు చెప్పారు. కోర్టు హాలులో గురువారం న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిష్కరించుకోదగిన కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కారం అయ్యేలా పనిచేయాలన్నారు. లోక్‌అదాలత్‌ల ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారం అవ్వటంతోపాటు కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. లోక్‌అదాలత్‌లో అన్ని కేసులైన క్రిమినల్, సివిల్ ప్రీలిటికేషన్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. సమావేశంలో న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
15న జెడ్పీ సర్వసభ్య
సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 15న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి జెడ్పీలో ఏడుస్థాయీ సంఘ సమావేశాలు జరగనుండగా, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుంచి జెడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ప్రభుత్వ శాఖల అధికారులు సమావేశాలకు హాజరవుతారని తెలిపారు.
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ
వేటపాలెం: స్థానిక బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాలను అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్ గురువారం తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసరాలు పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అధికారులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరినీ పరిశీలించిన అనంతరం పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నామన్నారు. ఏ విధమైన మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. పరీక్షలు ముగిసేంత వరకు పరీక్ష కేంద్రాల దగ్గరలో ఉన్న ఇంటర్‌నెట్ సెంటర్లను, జిరాక్స్ దుకాణాలను తెరవరాదని ఆదేశించారు. ఎస్సై ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటర్ సంస్కృత జవాబు పత్రాల మూల్యాంకనం
బాపట్ల: ఇంటర్మీడియెట్ సంస్కృత జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారం నుంచి చీరాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రారంభమౌతాయని విద్యాశాఖాధికారి యర్రయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూల్యాంకనం కోసం 29 మంది ఎగ్జామినర్స్, ఇద్దరు చీఫ్ ఎగ్జామినర్స్, ఇద్దరు పరిశీలకులను బోర్డు వారు కేటాయించినట్లు తెలిపారు. వారందరూ తప్పనిసరిగా 7వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు మూల్యాంకనం జరుగుతున్న చీరాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని విద్యాశాఖాధికారి కోరారు.
రేపు జాతీయ లోక్‌అదాలత్
Comments
Please login to add a commentAdd a comment