భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
యద్దనపూడి: భార్య కాపురానికి రాకపోవటంతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని పూనూరులో జరిగింది. మండలంలోని పూనూరు గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన తన్నీరు గంగరాజు (28) కు జె. పంగులూరు మండలం కొప్పెరపాడు గ్రామానికి మహిళతో ఏడేళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నాలుగేళ్ల కిందట అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా భార్య కాపురానికి రాకపోవటంతో ఈ నెల 4వ తేదీ భార్య దగ్గరికి వెళ్లి కాపురానికి రమ్మని చెప్పగా ఆమె నిరాకరించటంతో మనస్తాపానికి గురైన గంగరాజు బుధవారం మధ్యాహ్నం పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు ఎస్సై రత్నకుమారి తెలిపారు. మృతుని తండ్రి రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
బబ్బేపల్లి కొండపై మంటల కలకలం
మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి కొండపై గురువారం రాత్రి మంటలు స్థానికంగా కలకలం రేకెత్తించాయి. రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో కొండపై నుంచి ఎగిసిపడుతున్న మంటలను చూసిన స్థానికులు మంటల సమీపం లోకి వెళ్లి పరిశీలించారు. గొర్రెలు లేదా పశువుల కాపర్లు పొరపాటున విసిరిన సిగరెట్ లేదా బీడీలు మంటలకు కారణమై ఉండవచ్చని మొదట భావించారు. కానీ ఒకేసారి నాలుగైదు వైపుల నుంచి ఎగిసిపడుతున్న మంటలను చూసి ఎవరైనా కావా లని చేశారా.. అనే అనుమానం గ్రామస్తులు వ్యక్త పరుస్తున్నారు. ఈ విషయమై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్‌ను వివరణ కోరగా.. మంటలకు కారణం పొరపాటా లేక ఎవరైనా కావాలని చేశారా.. అనే విషయం శుక్రవారం ఉదయం వెళ్లి పరిశీలించి చెబుతామన్నారు.
పసుపు రైతులకు త్వరితగతిన పరిహారం
సబ్ కలెక్టర్‌ను కోరిన రైతు సంఘం బృందం
తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ గతేడాది జనవరిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై రైతు సంఘం నేతలు గురువారం తెనాలిలో సబ్ కలెక్టర్ సంజనా సింహాను కలిశారు. రైతులకు రావాల్సిన పరిహారంపై ప్రభుత్వం ఇచ్చిన హామీని త్వరితగతిన నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేములపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోల్ట్ స్టోరేజీ అగ్ని ప్రమాదంలో మొత్తం 380 మంది పసుపు రైతులకు పరిహారం అందాల్సి ఉందని తెలిపా రు. ప్రభుత్వం ఆమోదించిన పరిహారం మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించాలని కోరామని, సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివ సాంబిరెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులకు పరిహారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఎనిమి ది నెలల కిందట ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరకపోవడంపై విచారం వ్యక్తంచేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, వెంటనే పరిహారం ఇప్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, గద్దె శ్రీహరి, పోతురాజు కోటేశ్వరరావు, పేర్ని రవి, గుళ్లపల్లి సుబ్బారావు, యర్రు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment