పల్లె నుంచి పరిశోధన వైపు...
బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ బి.కృష్ణవేణి. ఆమె పరిశోధన స్థానం హెడ్ కూడా. నేటి మహిళకు స్ఫూర్తి. ఆమె తన కెరీర్ గురించి మాట్లాడుతూ మా తండ్రి శంకరరావు, తల్లి మంగమ్మ. మాది రేపల్లె. నాన్న నేవీలో ఉద్యోగి. మేము ముగ్గురం ఆడపిల్లలం, ఒక తమ్ముడు. అప్పట్లోనే ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నది నాన్న కోరిక. అలా నేను రేపల్లెలో హైస్కూల్ చదువు, నల్లపాడు సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో ఇంటర్, బాపట్ల అగ్రికల్చర్ కళాశాలలో డిగ్రీతోపాటు పీజీ పూర్తిచేశాను. 1994నుంచి 2001 వరకు ఇండియన్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్(హైదరాబాద్)లో రీసెర్చ్ అసోసియేట్‌గా ఉద్యోగం, అక్కడే పీహెచ్‌డీ కూడా చేశాను. 2002 నుంచి 2007 వరకు అమృతలూరు వ్యవసాయ అధికారి, 2007లో ఎన్‌జీ రంగా అగ్రికల్చ ర్ యూనివర్సిటీలో జాయినింగ్. ఇప్పటివరకూ బాపట్ల పరిశోధన స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్, అండ్ హెడ్. ఇక పెద్ద చెల్లి దుర్గారాణి ఉపాధ్యాయురాలు, ఇంకొక చెల్లి నాగమణి బాపట్ల డిగ్రీకళాశాల ప్రిన్సిపల్, తమ్ముడు శివప్రసాద్ ఉపాధ్యాయుడు. అప్పట్లోనే తమ తల్లిదండ్రులు చదివించడం వల్లే అందరం ఈ స్థాయిలో ఉన్నాం. ప్రతి తల్లి, తండ్రి ఆడపిల్లలను చదివించాలి. పిల్లలు పట్టుబట్టి చదవాలి, లక్ష్యాలు నిర్దేశించుకోవాలి, వాటిని సాధించాలి. మహిళలు ఉన్నతస్థాయిలో ఉంటే సమాజం సరైన దారిలో నడుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment