రుణం ప్రాణం తీసింది
అద్దంకి రూరల్: అప్పుల బాధతో మనోధైర్యాన్ని కోల్పోయి ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకుని ఓ కూలీ చనిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం అద్దంకి మండలంలో చోటుచేసుకుంది. ఈమేరకు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఎస్సై ఖాదర్‌బాషా కేసు నమోదు చేశారు. తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన ధనరాజుపల్లి కోటేశ్వరరావు (37) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది కిందట ప్రైవేటు ఫైనాన్స్‌లో ఇంటిపై రుణం తీసుకున్నాడు. ఆ ఆప్పు కట్టలేక పోతున్నానని భార్యతో చెప్పుకొని తీవ్ర మనోవేదన పడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా వేలాడుతున్నాడు. కొన ఊపిరితో ఉన్న కోటేశ్వరరావును అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలలో ఉంచారు.
అప్పుల బాధతో కూలీ ఆత్మ హత్య
Comments
Please login to add a commentAdd a comment