వీఐటీలో విటోపియా క్రీడా సాంస్కృతిక ఉత్సవం ప్రారంభం
తాడికొండ: విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయంలో విటోపియా–2025 వార్షిక క్రీడలు, సాంస్కృతిక ఉత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా తాడికొండ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసికాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.వీఐటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, వీఐటి–ఏపి విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ కోటా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రగతిని వివరించారు. మూడేళ్లుగా అవుట్ లుక్ ర్యాకింగ్స్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కేటగిరిలో దేశంలోనే ప్రథమస్థానంలో వీఐటీ ఉందని వెల్లడించారు. సాయంత్రం జరిగిన ప్రొ–షోలో సెహరి బ్యాండ్, స్వరాగ్ బ్యాండ్, డీజే పరోమాల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డాక్టర్ కృష్ణసామి (విటోపియా కన్వీనర్), డాక్టర్ ఖాదీర్ పాషా (స్టూడెంట్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్) పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment