అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు
కర్లపాలెం: నేడు మహిళలు బహుముఖ ప్రజ్ఞాశాలులై అన్ని రంగాలలో రాణిస్తున్నారని రెడ్‌క్రాస్ సొసైటీ కర్లపాలెం మండల అధ్యక్షుడు ఇనకొల్లు పోలీస్‌రావు చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయంలో ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తహసీల్దార్ సుందరమ్మ, ఎంఈవో విజయశ్రీ , మండల పరిషత్ సూపరిండెంట్ రజని, జూనియర్ అసిస్టెంట్ కల్యాణిలను రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మహిళలు మహరాణులని, ఊయలలు ఊపిన చేతులతో ప్రపంచాన్ని పాలించగలరని చెప్పారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ మండల ఉపాధ్యక్షుడు మందపాటి పరమానందకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment