మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన

Published Sat, Mar 8 2025 2:30 AM | Last Updated on Sat, Mar 8 2025 2:26 AM

మహిళా

మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన

57 ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం

నగరంపాలెం: మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టిన మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన లభించిందని ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి దీక్ష చెప్పారు.ఎస్పీ సతీష్‌కుమార్‌ నేతృత్వంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్‌స్టేషన్లలో మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమాన్ని నిర్వహించారు. చి మహిళా పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులను కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 64 మంది మహిళలు ఫిర్యాదులివ్వగా, అందులో 57 సమస్యలను తక్షణం పరిష్కరించినట్టు అధికారులు చెప్పారు. ఈ సదర్భంగా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి దీక్ష మాట్లాడుతూ ప్రత్యేక ఫిర్యాదుల విండో మంచి కార్యక్రమమని పేర్కొన్నారు.

దివ్యాంగుల బదిలీల్లో వెసులుబాటు కల్పించండి

గుంటూరు వెస్ట్‌: ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో దివ్యాంగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లయ్య కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఈ మేరకు కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులను ప్రాధాన్య క్రమంలో చేర్చి బదిలీలు నిర్వహించాలన్నారు. 70 శాతం పైబడి ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపునివ్వాలని ఒకవేళ వారు కోరుకుంటే మొదటి ప్రాధాన్యత వారికే ఇవ్వాలని కోరారు. 2025లో రూపొందించిన ఉపాధ్యాయ బదిలీ చట్టంలోని దివ్యాంగులకు ఇబ్బందికరంగా ఉన్న అంశాలను తొలగించాలన్నారు.

మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

పెదకూరపాడు: చదువుకోవటం నాకు ఇష్టం లేదు... నన్ను బలవంతం పెట్టకండి.. నేను హాస్టల్‌కి వెళ్లను. ఇంటివద్ద ఉంటాను... అంటూ విద్యార్థి చెప్పడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని పంట పొలంలోని పురుగులు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని జలాలపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జలాలపురం గ్రామానికి చెందిన మన్నవ శరీలు, చిట్టెమ్మల కుమార్తె మన్నవ జోష్‌ రాణి (17) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సెలవులకు స్వగ్రామం జలాలపురం వచ్చింది. సెలవులు అనంతరం కళాశాలకు వెళ్లకపోవటంతో తల్లి మందలించింది. చదువు ఇష్టం లేదని జోష్‌ రాణి చెప్పటంతో కళాశాలకు వెళ్లక పోతే నాతో పాటు వ్యవసాయ పనులకు రావాలని ఒత్తిడి చేయటంతో రెండు రోజులపాటు తల్లితో కలిసి మిరప కోత పనులకు వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం మిర్చి కోతలు కోస్తున్న పంట పొలంలో రైతు దాచుకున్న పురుగులు మందును తాగింది. వాంతులు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సత్తెనపల్లి ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన 
1
1/2

మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన

మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన 
2
2/2

మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement