వైభవంగా రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ప్రారంభం
చుండూరు(వేమూరు): చుండూరు మండలంలోని చినపరిమిలో శుక్రవారం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభించినట్లు ఈవో ఈమని అశోక్‌రెడ్డి తెలిపారు. ఉత్సవాలను 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున ధ్వజారోహణ, రాత్రి 9.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 12న స్వామి కల్యాణం, 13న అన్నసమారాధన ఉంటుందని ఆయన తెలిపారు. భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి
మార్టూరు: కుక్కలు దాడి చేసి గొర్రెలను చంపిన సంఘటన మండలంలోని ద్రోణాదులలో గురువారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బీసీ కాలనీకి చెందిన రాగినీడి గంగయ్య గొర్రెలను కోలలపూడి రోడ్డులోని తడికెల షెడ్డులో ఉంచి నిద్ర పోయాడు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కొన్ని కుక్కలు షెడ్డులో దూరి విచక్షణారహితంగా గొర్రెలపై దాడి చేశాయి. గంగయ్య మేల్కొని కుక్కలను తరిమివేసే లోపే 12 గొర్రెలను చంపేశాయి. వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. ఏడు నెలల కిందట ఇదే షెడ్డులో ఐదు గొర్రెలను కుక్కలు దాడి చేసి చంపినట్లు గంగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
కారు ఢీ.. వ్యవసాయ
కూలీ మృతి
బల్లికురవ: పొలం పనులు ముగించుకుని రోడ్డు దాటుతున్న వ్యవసాయ కూలీని వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం కొప్పరపాడు, వినుకొండ ఆర్ అండ్ బీ రోడ్డులోని ఆర్‌కే వైన్స్ సమీపంలో జరిగింది. మండలంలోని గొర్రెపాడు గ్రామానికి చెందిన జండ్రాజుపల్లి పున్నబాబు (44) పొలం పనులు ముగించుకుని రోడ్డు పైకి వచ్చాడు. ఈ సమయంలో వినుకొండ నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టంతో బలమైన గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కుటుం సభ్యుల ఫిర్యాదు మేరకు బల్లికురవ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
వైభవంగా రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ప్రారంభం
వైభవంగా రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment