ఆధ్యాత్మికతకు నెలవు జుమ్మా మసీదు
● 160 ఏళ్ల చరిత్ర కలిగిన భట్టిప్రోలు జుమ్మా మసీదు ● ఉమ్మడి జిల్లాలో గుంటూరు తర్వాత ఒక్క భట్టిప్రోలులోనే మసీదు
భట్టిప్రోలు: స్థానిక గర్డర్ బ్రిడ్జి రహదారిలోని జుమ్మా మసీదుకు ఎంతో ఘన చరిత్ర ఉంది. 160 సంవత్సరాల కిందట జమాలుద్దీన్ నిర్మించారు. ఆ కాలంలో ఉమ్మడి జిల్లాలో గుంటూరు తర్వాత ఒక్క భట్టిప్రోలులోనే మసీదు ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముస్లింలు నమాజు చేసుకునేందుకు ఇక్కడకు గుర్రాలపై తరలి వచ్చేవారని పెద్దలు చెబుతున్నారు. నమాజుకు వచ్చిన వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేసేవారని తెలిపారు. మసీదుకు ఎదురుగా ఉన్న గదుల్లో ప్రార్థన చేసేందుకు వచ్చేవారు ఒకప్పుడు విశ్రాంతి తీసుకునేవారు. గుర్రాలు నిలిపేందుకు ఈ భవనం కింద దారి ఉండేది. ఇప్పుడు అక్కడ దుకాణాలు వెలిశాయి. ఈ మసీదు ఏర్పడ్డాకే ఆయా జిల్లాలోని అన్ని ప్రాంతాలలో నెలకొల్పారు. నాటి నుంచి క్రమం తప్పకుండా ఐదు పూటలా నమాజులు, ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ వస్తున్నాయి. రంజాన్ మాసంలో ఉపవాసాలతో పాటు తరాబే నమాజులు జరుగుతాయి.
ప్రత్యేకతను సంతరించుకుంటున్న ఈద్గాలు
ముస్లింలు ప్రత్యేక నమాజులు చేసుకునేందుకు ఈద్గాల ప్రదేశం ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. కఠోర ఉపవాస దీక్షలను నిర్వహిస్తున్న ముస్లింలు ప్రతి నిత్యం మసీదులకు చేరుకుని, పూర్తి సమయాన్ని ప్రార్థనలతో గడుపుతూ ఆధ్యాత్మిక లోకంలో గడుపుతారు. ప్రతి ఏడాది పండుగ రోజున ప్రత్యేక నమాజు చేసే సందర్భంగా ముస్లింలు ఎంతో వ్యయాన్ని వెచ్చించి ఈద్గా ప్రాంతాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మండలంలోని అద్దేపల్లి, భట్టిప్రోలు, పల్లెకోన, వేమవరం, వెల్లటూరులోనూ మసీదులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment