ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
బాపట్ల: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే నిజమైన స్వేచ్ఛా, స్వాతంత్య్రం వచ్చినట్లుగా భావించాలని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. అపోలో స్పెక్టర్ చీరాల వారి సౌజన్యంతో బాపట్ల కాలేజీ ఆఫ్ ఫార్మసీలో ఉచిత మెడికల్ క్యాంపు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం నిర్వహించారు. డాక్టర్ ముప్పలనేని మాట్లాడుతూ మహిళలు తమ హక్కులను సాధించేందుకు ఐక్యంగా నిలబడాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ నిరుపమ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భావితరాలకు మంచి పౌరులను అందించే అవకాశం సీ్త్రలకే ఉందని, ఇంట్లో తమ పిల్లలను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి.ఈ.జి కే.మూర్తి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment