కళా సాధనకు నిరంతరం కృషి చేయాలి
సత్తెనపల్లి: ప్రతి మనిషిలో ఓ కళ ఉంటుందని, దాన్ని సాధించడానికి నిరంతర కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ రాసంశెట్టి నరసింహారావు అన్నారు. చైతన్య కళా స్రవంతి సత్తెనపల్లి 46వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ తెలుగు సినిమా పాటల పోటీలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జాతీయస్థాయి తెలుగు సినిమా పాటల పోటీలలో ప్రథమ బహుమతి మాధవి (విజయవాడ), ద్వితీయ బహుమతి కె.రామారావు (కారంపూడి), తృతీయ బహుమతి కె.దుర్గాప్రసాద్ (హైదరాబాద్) వారు కై వసం చేసుకున్నారు. వీరితోపాటు 10 మంది కన్సోలేషన్ బహుమతులు, 15 మంది ప్రత్యేక బహుమతులను అందుకున్నారు. బహుమతి ప్రదానోత్సవానికి చైతన్య కళా స్రవంతి గౌరవ సలహాదారు లయన్ ముట్లూరి వెంకయ్య అధ్యక్షత వహించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఏ.విశ్వేశ్వరరావు(పిడుగురాళ్ల), ఎస్.కళాంజలి(రాజంపేట), ఎం.రవివర్మ (నరసరావుపేట) వ్యవహరించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త పోతుగంటి రామ కోటేశ్వరరావు, శ్రీమారుతీ ట్రేడర్స్ అధినేత వెంకట హరేరామ చెంచయ్య పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ రాసంశెట్టి నరసింహారావు
జాతీయ స్థాయి సినిమా పాటల
పోటీల విజేత విజయవాడ మాధవి
Comments
Please login to add a commentAdd a comment