ఈనెల 12వ తేదీ రాత్రి పట్టణానికి చెందిన వేమవరపు విజయ్‌కుమార్, మరో 10 మందితో కలసి పట్టణంలోని ఏబీఎం హైస్కూల్ గేటు, రూముల తాళాలను పవర్‌కట్టర్‌తో కట్‌చేసి స్కూల్‌లోని విద్యుత్‌మోటారు, విలువైన వస్తువులను తస్కరించారు. ఈ విషయంపై ఈనెల 13న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాం. పట్టించుకోవడం లేదు. పైగా ఫిర్యాదుదారులను రోజుమార్చి రోజు స్టేషన్‌కు పలిచి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. నిందితులు మాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. చర్యలు తీసుకోవాలి.
–డి.జాన్‌ప్రసన్నబాబురావు, ఎస్.రోజన్‌బాబు, సెక్రటరిలు ఏబీఎఫ్‌ఎంఎస్ ప్రొటెక్షన్ కస్టోడియన్