కూటమి సర్కార్‌పై ఏఎన్‌పీఎస్ అధ్యక్షుడు ఆగ్రహం
బాపట్ల టౌన్: వర్గీకరణపేరుతో మాలలు, మాదిగలను విడగొట్టేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని అంటరానితన నిర్మూలన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చార్వాక తెలిపారు. కూటమి సర్కార్ వర్గీకరణను జనాభా లెక్కలు పూర్తిగా తేల్చిన తర్వాతనే చేయాలంటూ శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. డాక్టర్ చార్వాక మాట్లాడుతూ వర్గీకరణపై కూటమి ప్రభుత్వం పునరాలోచించుకోవాలన్నారు. దళిత ప్రజా సంఘాలు. గత సంవత్సరం ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాన్నిస్తూ తీర్పు ఇచ్చిందన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయాలని ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జై భీమ్‌రావు పార్టీ బాపట్ల నియోజకవర్గ కన్వీనర్ కొచ్చెర్ల వినయ్‌రాజు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు, రాష్ట్ర మాలమహానాడు అధికార ప్రతినిధి శీలం రోజన్‌బాబు, గుద్దే రాజారావు, గొర్రుముచ్చు వందనం, డాక్టర్ కాగిత వరప్రసాద్, పర్రె కోటయ్య, కొరగంటి శ్యామ్, జోగి ప్రసంగి, తురిమెళ్ళ అమ్మేశ్వరరావు, పేర్లి కాంతారావు పాల్గొన్నారు.