ఎఫ్‌ఆర్‌ఓ త్యాగం మరువలేనిది
చుంచుపల్లి: అడవుల సంరక్షణనే ధ్యేయంగా పనిచేస్తూ విధి నిర్వహణలో గొత్తిగోయల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరవీరుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు త్యాగం మరువలేనిదని జిల్లా అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం సీఎస్‌ఆర్ సెంట్రల్ పార్క్‌లో రెండో వర్ధంతి నిర్వహించారు. శ్రీనివాసరావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో డీఎఫ్‌ఓ మాట్లాడుతూ అడవుల సంరక్షణలో అటవీశాఖ సిబ్బంది, ఉద్యోగుల కృషి ఎనలేనిదని అన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం విధుల్లో ఉంటూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు సతీమణి భాగ్యలక్ష్మి, పిల్లలు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్లు కోటేశ్వరరావు, దామోదర్‌రెడ్డి, సుజాత, మక్సూద్, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment