నలుగురికి గాయాలు
జూలూరుపాడు: మండలంలోని వినోభానగర్ గ్రామ సమీపంలో తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారిపై గురువారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని నలుగురు గాయపడ్డారు. కొత్తగూడేనికి చెందిన సింగరేణి ఉద్యోగులు ప్రశాంత్, శ్రీనివాస్, తిరుమలరెడ్డి కారులో ఖమ్మం వెళ్తున్నారు. సుజాతనగర్ శివాలయం ఈఓ చంద్రశేఖర్ హరి తన కారులో ఖమ్మం నుంచి సుజాతనగర్ వెళుతున్నారు. ఈ క్రమంలో వినోభానగర్ సమీపం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నా యి. దీంతో నలుగురికీ గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఈఓను ఖమ్మం ఆస్పత్రికి, సింగరేణి ఉద్యోగులను కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment