కామేపల్లి: కల్లంలో ఆరబెట్టిన మిర్చిని గుర్తు తెలియ ని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన ఇది. మండలంలోని ముచ్చర్లకు చెందిన రైతు జాల శివకృష్ణ ఇటీవల మిర్చి కోయించి కల్లంలో ఆరబెట్టాడు. బుధవారం తీర్థాల జాతరకు వెళ్లిన ఆయన గురువారం తెల్ల వారుజామున కల్లం వద్దకు వచ్చేసరికి సుమారు 10 బస్తాల్లో మిర్చిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. అంతేకాక మరో ఎనిమిది బస్తాల్లో మిర్చి నింపి ఉండడంతో చుట్టుపక్కల గాలించగా.. ఎలక్ట్రికల్ స్కూటీ కనిపించింది. చోరీ చేసిన మిర్చి విలువ రూ.60 వేల వరకు ఉంటుందని, నిందితులను గుర్తించి తనకు న్యాయం చేయాలని శివకృష్ణ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment