కాంట్రాక్ట్ కార్మికుడి దారుణ హత్య
మణుగూరుటౌన్: ఓబీ కంపెనీలో పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కి చెందిన కార్మికుడిని గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోది, దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం మణుగూరులో వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్ రాష్ట్రం సిద్ధి జిల్లా గోహరి గ్రామానికి చెందిన మునిసింగ్ బిశ్వకర్మ (42) స్థానిక ఓ ఓబీ కంపెనీలో మెకానిక్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. గాంధీనగర్ చర్చ్ సమీపంలోని ఓసీ–4 దుర్గా ఓబీ కంపెనీ పాత డంప్‌యార్డ్ వద్దకు బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తికి శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, పేకముక్కలు చిందరవందరగా పడేసి ఉండగా, అక్కడి మంచం నవారును మెడకు చుట్టి బండరాయితో తలపై మోది హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ సోమ సతీశ్, ఎస్‌ఐలు సందర్శించి డాగ్ స్క్వాడ్ ద్వారా ఓబీ కంపెనీ గ్యారెజీలో తనిఖీ చేశారు. కంపెనీ ప్రతినిధి ముత్తుతో పాటు పలువురిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కంపెనీ మెనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీశ్ పేర్కొన్నారు.
ముగ్గురు నిర్దోషులుగా తీర్పు
భద్రాచలంటౌన్: నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నారనే అంశంలో ముగ్గురిపై కేసు నమోదు కాగా, విచారణలో నేరం రుజువు కానందున నిర్దోషులుగా భద్రాచలం ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి వి.శివనాయక్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. 2013లో ములకలపల్లి అశోక్, కొండసాని రాము, కత్తుల వెంకటేశ్వర్లుపై రూ.3 వేలు అసలు నోట్లు ఇస్తే రెట్టింపు నకిలీ నోట్లు ఇస్తామని చెప్పారనే అభియోగంపై కేసు నమోదైంది. ఈ మేరకు భద్రాచలం టౌన్ పోలీసులు చారి్‌జ్‌షీట్ దాఖలు చేయగా, విచారణలో నేరం రుజువు చేయలేకపోవడంతో వీరిని నిర్దోషులుగా తీర్పు చెప్పారు.
ఇసుక లారీ సీజ్
ములకలపల్లి: అనుమతుల్లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ రాజశేఖర్ కథనం మేరకు.. జగన్నాథపుర వైపు ఇసుక తరలిస్తున్నట్లు అందిన నమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. కంపగూడెం క్రాస్ రోడ్డు వద్ద ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీని సీజ్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment