మెరుగైన వైద్య సేవలు అందించాలి
అశ్వారావుపేటరూరల్: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ అన్నారు. బుధవారం ఆయన అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. డయాలసిస్ వార్డును పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్, ఫార్మసీ, ఇతర వార్డులను తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న పోస్టుమార్టం భవనం, నిర్మాణం పూర్తయిన సీఎస్‌ఆర్ భవనాలను పరిశీలించారు. అనంతరం అశ్వారావుపేటలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, రక్త పరీక్షా కేంద్రాలు, స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఫీజు వివరాలను బోర్డుల్లో ప్రదర్శించాలని, ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిమితికి మించి వైద్యం చేయవద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో డీఐఓ బాలాజీ నాయక్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి, వైద్యులు విజయ్‌కుమార్, వినాయకపురం పీహెచ్‌సీ వైద్యులు రాందాస్, విజయ్ కుమార్, సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సమష్టిగా కృషి చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కుష్ఠు రహిత జిల్లా కోసం సమష్టిగా కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ అన్నారు. ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు జరిగే కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంపై బుధవారం నిర్వహించిన ఆశాకార్యకర్తలు, యూనియన్ నాయకుల సమావేశంలో మాట్లాడారు. అనుమానిత వ్యక్తులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని సూచించారు. కాగా జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భర్తీ చేసిన 9మంది ఆయుష్ ఫార్మసిస్ట్ అభ్యర్థులకు బుధవారం డీఎంహెచ్‌ఓ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు బి.బాలాజీ, భద్రు, శ్రీనివాస్, రాంప్రసాద్, యూనియన్ నాయకులు రవికుమార్, ఝాన్సీ, విజయలక్ష్మి, లత, సరిత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్ నాయక్
Comments
Please login to add a commentAdd a comment