నాణ్యమైన విద్యుత్ అందిస్తాం..
జూలూరుపాడు: రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మహేందర్ అన్నారు. బుధవారం కాకర్ల గ్రామంలో విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మహేందర్ మాట్లాడారు. కెపాసిటర్లు బిగించుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు, ఆటో స్టార్టర్లు పెట్టడం వల్ల కలిగే నష్టాల గురించి రైతులకు వివరించారు. అక్రమంగా వ్యవసాయ మోటార్లు నడుపుతున్న రైతులు తప్పనిసరిగా విద్యుత్‌శాఖకు డబ్బులు చెల్లించి రశీదు తీసుకొని సర్వీస్ రెగ్యులరైజ్ చేసుకోవాలన్నారు. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్ స్థలాన్ని ఎస్‌ఈ పరిశీలించారు. త్వరలో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పడమటనర్సాపురం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ టౌన్ ఫీడర్‌ను ఎస్‌ఈ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈ రంగస్వామి, ఏడీఈ రవికుమార్, జూలూరుపాడు ఏఈ సతీశ్, సబ్ ఇంజనీర్ ప్రవీణ్, అసిస్టెంట్ లైన్‌మెన్ ఎన్.భాస్కర్‌రావు, రైతులు అల్లాడి నరసింహారావు, వందనపు సత్యనారాయణ, చావా వెంకటరామారావు, అల్లాడి లింగారావు, చావా కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment