రామయ్యకు గోటి తలంబ్రాలు
దమ్మపేట: దమ్మపేట గ్రామానికి చెందిన మహిళలు 8 లక్షల 11 వేల గోటి తలంబ్రాలను రామయ్య కల్యాణానికి సిద్ధం చేశారు. శ్రీసీతారామ భక్త కమిటీ ఆధ్వర్యంలో మహిళలు చేతి గోళ్లతో ఒలిచి తలంబ్రాలను తయారు చేశారు. ముక్కోటి ఏకాదశి రోజు ఈ కార్యక్రమం ప్రారంభించి బుధవారం నాటికి పూర్తి చేశారు. వీటిని భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి ఆలయంలో సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ భక్త కమిటీ అధ్యక్షురాలు మురహరి గంగ, సభ్యులు సత్యవతి, సరస్వతి, అత్తులూరి కుమారి, కందుకూరి విజయ తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రగా భద్రాచలం..
జూలూరుపాడు:ఽఽ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గోటి తలంబ్రాలను సమర్పించేందుకు బుధవారం పలువురు రామభక్తులు పాదయాత్రగా వెళ్లారు. ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో కొత్తూరు గ్రామ పంచాయతీ పెద్దహరిజనవాడ, జూలూరుపాడు, వెంగన్నపాలెం, అనంతారం, తది తర గ్రామాల రామభక్తులు నెల రోజులుగా గోటి తలంబ్రాలను ఒలిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణమహోత్సవానికి గోటి తలంబ్రాలను సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment