సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
కొత్తగూడెంటౌన్: అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. బుధవారం హేమచంద్రాపురంలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన నేరు సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులు లేకుండా చూడాలన్నారు. పోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయాలని ఆదేశించారు. అనంతరం వర్టికల్ విభాగంలో ప్రతిభ చాటిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, చంద్రభాను, రవీందర్, సతీష్‌కుమార్, మల్ల య్యస్వామి, సీఐలు శ్రీనివాస్, రమాకాంత్, నాగరాజురెడ్డి, ఎస్సైలు హారిక, హసీనా పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు
Comments
Please login to add a commentAdd a comment