కృత్రిమ మేధస్సుతో బోధన మేలు
బూర్గంపాడు: చదువులో వెనుకబడిన పిల్లలకు కృత్రిమ మేధస్సుతో విద్యాబోధన చేయడం ఎంతో ఉపకరిస్తుందని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ అన్నారు. బుధవారం సారపాక గాంధీనగర్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధస్సుతో విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్న తరగతులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం చదువులో వెనుకబడిన పిల్లలను గుర్తించి అభ్యాసన మెరుగుపడటానికి స్థాయిని అంచనా వేయడానికి ఎంతో ఉపకరిస్తుందన్నారు. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని గాంధీనగర్ పాఠశాలలో ప్రారంభించిందని చెప్పారు. కార్యక్రమంలో ఎదు నర్సింహారావు, హెచ్‌ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు లక్ష్మీప్రసన్న, గోపాల్‌రావు, శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని గుట్ట లక్ష్మీపురం గ్రామంలోని అభ్యుదయ రైతు సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్న పుచ్చ, మిరప, జామ పంటలను ఐటీడీఏ పీఓ రాహుల్ పరిశీలించారు. రూ.20 లక్షల ఖర్చుతో 20 ఎకరాల్లో పుచ్చకాయ పంట సాగు చేయడంతో పాటు కోత్‌కతా నుంచి వచ్చిన ఈ–మ్యాక్స్ విత్తనంతో కేవలం 70 రోజుల్లో దిగబడి రావడం గురించి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏడీ ఉదయ్‌భాస్కర్, హెచ్‌ఓ వేణుమాధవ్ తదితరులు ఉన్నారు.
ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదగాలి
ఇల్లెందురూరల్: విద్యార్థి దశ నుంచే చదువుపై ఆసక్తి పెంచుకొని ఉన్నతంగా ఎదగాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. మండలంలోని బొజ్జాయిగూడెం ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. వంట, వసతి గదులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రాథమిక తరగతుల నుంచి విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను అందుబాటులోకి తెచ్చామని, ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు భవిష్యత్ ప్రణాళిక అవసరమని, అందుకోసం కెరీర్ గైడెన్స్ పేరుతో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏటీడీఓ సూర్నపాక రాధ, హెచ్‌ఎం నాగమణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment