భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా 40 రోజుల్లో రూ. కోటికి పైగా ఆదాయం సమకూరింది. హుండీలను గురువారం లెక్కించగా రూ.1,14,60,041 నగదుతో పాటు 133 గ్రాముల బంగారం, 1,262 గ్రాముల వెండి లభ్యమయ్యాయి. ఇంకా ఇతర దేశాల కరెన్సీ కూడా లభించినట్లు ఈఓ రమాదేవి తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓలు శ్రవణ్‌కుమార్, భవానీ రామకృష్ణ, సీసీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి రామాలయంలో
హుండీల లెక్కింపు