చుంచుపల్లి: నిత్యం ఆరోగ్యంగా ఉంటూ అడవులను రక్షిద్దామని జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టాగౌడ్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆ శాఖ సిబ్బందికి నిర్వహించిన 5కే రన్‌ను స్థానిక ప్రకాశం స్టేడియం వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ సిబ్బంది నిత్యం పని ఒత్తిడికి లోనవుతుంటారని, ఎప్పటికప్పుడు ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు అవసరమైన వ్యాయామం చేయాలని సూచించారు. ఆరోగ్యంపై అశ్రద్ధ వహించొద్దని అన్నారు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటేనే విధుల్లో రాణిస్తామని చెప్పారు. జిల్లాలో అడవుల సంరక్షణకు సిబ్బంది చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. వేసవిలో జంతువుల రక్షణకు చర్యలు చేపట్టాలని, అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిబ్బంది సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని భరోసా ఇ చ్చారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఎఫ్‌డీఓ యు. కోటేశ్వరరావు, రేంజ్ అధికారులు శ్రీనివాసరావు, ప్రసాదరావు, ఎల్లయ్య, ముక్తార్ హుస్సేన్, రామవరం రేంజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పోడు సాగు జరగకుండా చర్యలు..
పాల్వంచరూరల్ : అడవుల సంరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని, పోడుసాగును అరికట్టాలని డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్ అన్నారు. స్థానిక టెరిటోరియల్ డివిజన్ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా అటవీ ప్రాంతంలో పోడు సాగు చేయకుండా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. అడవులు ఆక్రమణకు గురికాకుండా చూడాలని, మొక్కలను విరివిగా పెంచాలని, వన సంరక్షణే ధ్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓలు కట్టా దామోదర్‌రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.
5కే రన్ ప్రారంభోత్సవంలో
డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్