
స్పోర్ట్స్ ఇంట్రెస్ట్, ఫిట్‌నెస్ కోసం ప్రయత్నిస్తున్న వారికి గుడ్‌న్యూస్. క్రీడా, ఫిజికల్ ఫిట్‌నెస్ ఉత్పత్తులపై అమెజాన్ భారీ తగ్గింపులు ప్రకటించింది. జూన్ 26, 27 రెండు తేదీల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. అన్ని రకాల ఫిట్‌నెస్, స్పోర్ట్స్ ఐటమ్స్‌తో పాటు ఆటోమొబైల్ ఉత్పత్తులపైనా ఆఫర్లు ఉన్నాయి.
60 శాతం
అమెజాన్ ప్రకటించిన స్టోర్ట్స్ అవుట్ డోర్ సేల్స్‌లో ఫిట్‌నెస్ ఉత్పత్తులపై 60 శాతం వరకు తగ్గింపు ధరలు ప్రకటిచింది. డంబెల్స్ మొదలు ట్రెడ్‌మిల్ వరకు రకరకాల ఉత్పత్తులపై డిస్కౌంటు ప్రకటించింది. మరోవైపు స్పోర్ట్స్ ఉత్పత్తులపై కూడా ఇదే తరహాలో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఫిట్‌నెస్ విభాగంలో నయా ట్రెండ్‌గా వచ్చిన స్మార్ట్‌వాచ్‌లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఆటోమొబైల్ వాహనాల ప్రొడక్ట్స్ పై 30శాతం నుంచి 45శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.