Sports - fitness
-
ఫిట్నెస్, స్పోర్ట్స్ ఐటమ్స్‌పై అమెజాన్‌లో స్పెషల్ ఆఫర్
స్పోర్ట్స్ ఇంట్రెస్ట్, ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్న వారికి గుడ్‌న్యూస్. క్రీడా, ఫిజికల్ ఫిట్నెస్ ఉత్పత్తులపై అమెజాన్ భారీ తగ్గింపులు ప్రకటించింది. జూన్ 26, 27 రెండు తేదీల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. అన్ని రకాల ఫిట్నెస్, స్పోర్ట్స్ ఐటమ్స్‌తో పాటు ఆటోమొబైల్ ఉత్పత్తులపైనా ఆఫర్లు ఉన్నాయి. 60 శాతం అమెజాన్ ప్రకటించిన స్టోర్ట్స్ అవుట్ డోర్ సేల్స్‌లో ఫిట్నెస్ ఉత్పత్తులపై 60 శాతం వరకు తగ్గింపు ధరలు ప్రకటిచింది. డంబెల్స్ మొదలు ట్రెడ్మిల్ వరకు రకరకాల ఉత్పత్తులపై డిస్కౌంటు ప్రకటించింది. మరోవైపు స్పోర్ట్స్ ఉత్పత్తులపై కూడా ఇదే తరహాలో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఫిట్నెస్ విభాగంలో నయా ట్రెండ్‌గా వచ్చిన స్మార్ట్‌వాచ్‌లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఆటోమొబైల్ వాహనాల ప్రొడక్ట్స్ పై 30శాతం నుంచి 45శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. -
క్రీడా విద్యకు ఎన్ఎండీసీ సహకారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఖనిజ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్ఎండీసీ.. క్రీడా విద్య ప్రోత్సాహానికి తన వంతు సహకారాన్ని అందించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, టెన్విక్ స్పోర్స్లు సంయుక్తంగా పలు పాఠశాలల్లో అందిస్తున్న క్రీడా విద్య కార్యక్రమాలకు ఎన్ఎండీసీ సీఎస్ఆర్ ఫౌండేషన్ రూ.2 కోట్లను అందించనుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ గౌరవ్ ద్వివేది, సంస్థ డైరెక్టర్ సందీప్ తులా, టెన్విక్ చైర్మన్ అనీల్ కుంబ్లే ఈమేరకు కుదిరిన ఎంఓఏలపై సంతకాలు పూర్తిచేశారు. -
ఖర్చు లేకుండానే వ్యాయామం చేయడం ఎలా..?
నాకు జిమ్‌లో చేరేంత ఆర్థిక స్తోమత లేదు. కానీ వ్యాయామం చేయాలనే ఆసక్తి ఉంది. నేను పెద్దగా ఖర్చు పెట్టకుండానే చేసుకోగలిగే వ్యాయామాలను సూచించండి. - జీవన్, జగ్గయ్యపేట వ్యాయామం చేయాలనే ఆసక్తి ఉంటే చాలు... దీనికి జిమ్‌లో చేరాల్సిన అవసరమే లేదు. మన బరువు ఆధారంగానే చేయదగ్గ వ్యాయామాలు, మనం నిత్యం ఉపయోగించే అనేక రకాల వస్తువులతోనే చేయదగ్గ ఎక్సర్‌సైజ్‌లతో జిమ్‌లో వ్యాయామం చేసిన ఫలితాలు పొందవచ్చు. దీనికి కావాల్సిందల్లా సంకల్పబలం. వ్యాయామం చేయడంలో క్రమం తప్పనివ్వకపోవడం (రెగ్యులారిటీ). మీరు రోజూ బ్రిస్క్ వాకింగ్ లేదా స్లో జాగింగ్ చేయాలనుకుంటే దీనికి ఎలాంటి ఖర్చూ అవసరం లేదు. అలాగే మీ బరువు ఆధారంగా చేసే వ్యాయామాలు... ఉదాహరణకు దండీలు, బస్కీల వంటివి చేయవచ్చు. మీకు వీలుకాకపోతే వీటికోసం గ్రౌండ్‌కు వెళ్లాల్సిన పని కూడా లేదు. మీ ఇంట్లోనే చేయవచ్చు. రన్నింగ్, స్లోజాగింగ్ను ఒక చోట స్థిరంగా నిలబడి కూడా (అక్కడికక్కడే పరుగెత్తుతున్నట్లుగా కాళ్లు కదిలిస్తూ) చేయవచ్చు. మీరు మొదట వాకింగ్ లేదా స్లో రన్నింగ్/జాగింగ్‌ను ప్రారంభిస్తే... మొదట 20 నిమిషాల నుంచి మొదలుపెట్టి... ఆ తర్వాత క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతూ... 90 నిమిషాల వరకు చేయవచ్చు. అలాగే మీ బరువు 85 కిలోలకు పైన ఉంటే వాకింగ్/జాగింగ్ కాకుండా సైక్లింగ్ చేయవచ్చు. ఇక ఈ సైక్లింగ్ కోసం మీరు ప్రత్యేకంగా సైకిల్ కొనాల్సిన అవసరం లేదు. మీరు రోజూ ఉపయోగించే సైకిల్‌తో కూడా వ్యాయామపు సైకిల్ ప్రయోజనాలే దక్కుతాయి. ఇక మీ బరువును ఆసరాగా చేసుకుని చేసే వ్యాయామాలైన దండీలు, బస్కీలతో పాటు ఒక చోట వేలాడుతూ, శరీరాన్ని పైకి లేపుతూ చేసే చినప్ ఎక్సర్సైజ్ల వంటివి చేయవచ్చు. మీ ఇంట్లో ఉండే వాటర్‌బాటిల్ సహాయంతో డంబెల్ ఎక్సర్‌సైజ్‌లను చేయవచ్చు. మీకు మోకాళ్లలో ఎలాంటి నొప్పులూ లేకపోతే మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు చేయవచ్చు. ఒకవేళ డాబా లేని కారణంగా మెట్లు లేకపోతే... మీ ఇంటి ఒకే మెట్టుపైకి మాటిమాటికీ ఎక్కుతూ కూడా మెట్లు ఎక్కే వ్యాయామం రిపిటీషన్స్ను ఎన్నైనా చేయవచ్చు. ఇవన్నీ వ్యాయామ రీతులు. ఇక ఇంటి పనుల విషయానికి వస్తే... మొక్కలకు నీళ్లు పోయడం, నీళ్లు తోడటం వంటి పనులు చేయవచ్చు. మీరు ఆఫీసుకు బైక్ మీద వెళ్లే వారైతే... దానికి బదులు సైకిల్ వాడటం లేదా ఇంటి దగ్గరే ఉన్న కిరాణా షాప్ వంటి చోట్లకు నడుచుకుంటూ వెళ్లి, సామాన్లు మోసుకురావడం వంటివి కూడా వ్యాయామంగానే పరిగణించవచ్చు. ఈ తరహా వ్యాయామాలకు ఎలాంటి ఖర్చూ అవసరం లేదు. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
నాకు వెన్ను నొప్పి... సర్జరీ తప్పదా?
నేను కంప్యూటర్‌పై కూర్చుని ఎక్కువగా పనిచేస్తుంటాను. ఇటీవల విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే సర్జరీ అవసరం అన్నారు. నాకు సర్జరీ అంటే భయం. మరో మార్గం లేదంటారా? - సులోచన, విశాఖపట్నం సాధారణంగా యాక్సిడెంట్ లేదా ఏదైనా వ్యాధి కారణంగానో వెన్నునొప్పి వచ్చిన సందర్భాలను మినహాయించి, ప్రతి వెన్నునొప్పికీ శస్త్రచికిత్స ఒక్కటే మార్గం కాదు. సర్జరీతోనే వెన్నునొప్పికి పరిష్కారం దొరుకుతుందనీ, ఆపరేషన్ చేయకపోతే తగ్గదనేది అపోహ మాత్రమే. మనం కూర్చునే భంగిమలు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఒకవేళ ఫాల్టీ పోశ్చర్స్ల్లో కూర్చుంటుంటే వాటిని సరిచేసుకుంటే చాలావరకు సమస్య తగ్గుతుంది. కాబట్టి సాధారణ వెన్నునొప్పుల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ, తగిన చికిత్స తీసుకుంటే చాలావరకు అవి తగ్గుతాయి. ఇక కొన్ని రకాల వెన్నునొప్పులు బరువులు ఎత్తుతుండటం వల్ల వస్తే... వాటిని ఎత్తే విధానాల్లో మార్పులతో అవి కూడా తగ్గుతాయి. ఇంకొన్ని రకాలు కొన్ని వ్యాయామాలతో నయమవుతాయి. వెన్నునొప్పులకు యోగా కూడా చక్కటి మార్గం. అయితే నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆసనాలు వేయడం మంచిది కాదు. అందుకే యోగా ఎప్పుడు, ఎలా చేయాలన్నది ట్రైనర్ సహాయంతో చేస్తేనే మంచిది. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
ఆకర్షణీయమైన రంగులతో ఉండే ఆహారాలు తీసుకోవచ్చా?
మా బాబు బాగా ఆకర్షణీయమైన రంగులు ఉండే స్వీట్లు, ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటాడు. ఇది మంచిదేనా? - సుమాల, బెంగళూరు కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలు తీసుకోవడమే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. దాంతో వాటి దుష్ర్పభావం మూత్రపిండాల పై పడుతుంది. ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అది దీర్ఘకాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడే ప్రిజర్వేటివ్స్లో సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4 ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణులు (హైపర్యాక్టివిటీ) పెరుగుతాయని తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనా లు విటమిన్ ’సి’ తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్సన్ డిసీజ్ లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయ్యింది. అందుకే అతిగా రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లల ను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
‘వాకింగ్’కు సూచనలివ్వండి...
నేను చాలా కాలంగా వాకింగ్ మొదలుపెట్టాలని అనుకుంటూ వాయిదా వేస్తూ పోతున్నాను. ఇప్పుడు తప్పక వాకింగ్ ప్రారంభించాలనుకుంటున్నాను. మంచి సూచనలు చెప్పండి. - సూర్యప్రకాశ్, అనంతపురం మీలాగే చాలా మంది నడక మొదలుపెట్టాలనుకుంటూనే అలా వాయిదా వేసుకుంటూ పోతారు. వాకింగ్ తేలికపాటి వ్యాయామమే కాబట్టి చలికాలం వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదు. నడక మొదలు పెట్టాలనుకున్న తర్వాత వాయిదా వేయకూడదు. నడకను ఆస్వాదిస్తూ వాకింగ్ చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కొత్తగా వాకింగ్ మొదలు పెట్టాలనుకున్నవారికి కొన్ని సూచనలు... వాకింగ్ కోసం మీ ఆర్థిక స్థోమతను బట్టి ట్రెడ్మిల్ సమకూర్చుకోవచ్చు. ట్రెడ్మిల్ మీద నడవటం వల్ల మనం ఎంత వేగంగా నడుస్తున్నామో తెలుసుకోవచ్చు. పైగా దీని వల్ల వాకింగ్ కార్యక్రమం ఇంట్లోనే జరుగుతుంది. అయితే ఉదయం వేళల్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆరుబయట నడిస్తే ఉండే హాయి వేరు. వాకింగ్ మొదలు పెట్టినప్పుడు ముందుగా రెండు రోజుల పాటు 10-20 నిముషాలపాటు మాత్రమే నడవండి. మొదలుపెట్టినరోజే అరగంట, గంట అని లక్ష్యాలు పెట్టుకోవద్దు. మీ నడక వ్యవధిని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. మొదట పది, ఇరవై నిమిషాల నుంచి మొదలై దాన్ని క్రమంగా 60 నిముషాలకు పెంచండి. అయితే మీరు అరవై నిమిషాల వ్యవధికి చేరడానికి రోజుకు ఐదు నిమిషాల వ్యవధి చొప్పున పెంచుకుంటూ పోవడం మంచిది. ముందుగా నడిచే దూరాన్ని పెంచుకోవాలి. తరువాతే నడకలో వేగాన్ని పెంచాలి. అయితే దూరాలకు నడవడం, నడకలో వేగాన్ని పెంచడం అన్నది ఒకేసారి వద్దు. దీన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. మొదట మూడు వారాల పాటు మామూలు వాకింగ్ చేశాక అప్పుడు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్) చేయాలి. వాకింగ్‌లో మ్యారథాన్, వాకథాన్ చేసేవాళ్లు కనీసం మొదటిసారైనా ఎక్స్పర్ట్ సలహా తీసుకోవాలి. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్