క్షణం తీరిక లేకుండా వ్యాపారాల్లో మునిగితేలుతున్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. స్పూర్తినిచ్చే కథనాలు, ఆసక్తి గొలిపే అంశాలను క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. అయితే ఇన్నాళ్లు జోకులకు ఎన్నో మీమ్స్‌కి కారణమైన ఓ ఫోటోని ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఫన్నీగా కనిపించే ఆ ఫోటో వెనుక దాగున్న వ్యాపార కిటుకులను నెటిజన్లతో పంచుకున్నారు.
మోపెడ్‌పై ప్రయాణిస్తున్న ఓ జంట ఫోటోను నెట్‌లో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. అయితే ఈ ఫోటోలో ఆ మోపెడ్‌పై ఆ జంటకు తోడుగా పదుల సంఖ్యలో కూర్చీలు, చాపలు కూడా తీసుకెళ్తుంటారు. ఇంతకాలం ఇదే ఫోటోను అందరూ టిపికల్ ఇండియన్ మెంటాలిటీ అంటూ ఓ జోక్‌గా పరిగణించేవారు. కానీ ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్ర కంటికి ఈ ఫోటో మరోలా కనిపించింది.
ఇండియాలోనే ఎక్కువ టూ వీలర్లు ఎందుకు తయారవుతాయో తెలుసా? ప్రతీ చదరపు ఇంచుకి ప్రపంచంలోనే అత్యధికంగా సరుకు రవాణా చేయగల సామర్థ్యం మన సొంతం. టూవీలర్లు మన దగ్గర అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ‘వీ ఆర్ లైక్ దట్ ఓన్లీ’ ఎక్కడా తగ్గేదే లే అన్నట్టుగా చమత్కరించారు.
Now you know why India makes the most two-wheelers in the world. We know how to carry the highest volume of cargo per square inch of wheel…We are like that only… #Sunday pic.twitter.com/3A0tHk6IoM
— anand mahindra (@anandmahindra) April 3, 2022
Comments
Please login to add a commentAdd a comment