ఎంతగానో ఎదురు చూస్తున్న యాపిల్ ( Apple ) ఐఫోన్ 15 ( iPhone 15) సిరీస్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ గురించి తెలిసింది. ఐఫోన్ 15 లాంచ్ డేట్‌పై యాపిల్ పెదవి విప్పలేదు. కానీ సెప్టెంబర్ 12 లేదా 13 తేదీల్లో ఐఫోన్ 15 విడుదలవుతుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 15 రంగులకు సంబంధించి తాజా రూమర్ ఒకటి విస్తృతంగా ప్రచారమవుతోంది.
ఐఫోన్ల, ఇతర యాపిల్ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించే 9to5Mac అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 ప్రో ( iPhone 15 Pro ) కోసం యాపిల్ కంపెనీ రెండు కొత్త కలర్ ఆప్షన్‌లను పరిచయం చేయాలని యోచిస్తోంది. గోల్డ్, పర్పుల్ కలర్ ఆప్షన్‌లను నిలిపివేసి కొత్తగా గ్రే, బ్లూ కలర్స్‌ను తీసుకురానుంది.
గోల్డ్, పర్పుల్ కలర్స్ అవుట్!
ఐఫోన్లలో ముందు నుంచి వస్తున్న గోల్డ్, పర్పుల్ కలర్ ఆప్షన్‌లను ఐఫోన్ 15 ప్రో మోడల్‌తో నిలిపేస్తున్నట్లు చెబుతున్నారు. 2018లో ఐఫోన్ ఎక్స్‌ఎస్ మోడల్ నుంచి గోల్డ్ కలర్ ఆప్షన్‌ను యాపిల్ కొనసాగిస్తోంది. నిజానికి ఐఫోన్ 6 మోడల్ నుంచే గోల్డ్ కలర్ ఏదో ఒక రూపంలో ఉంటూ వస్తోంది. ఇక పర్పుల్ కలర్ వేరియంట్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌తో పరిచయమైంది.
These could be the new iPhone 15 Pro color options:
— Apple Hub (@theapplehub) August 24, 2023
- Space Gray
- Silver
- Titan Gray
- Dark Blue
Which color would you pick?
Source: @9to5mac pic.twitter.com/ePSwkkk9m4
సెప్టెంబరులో విడుదల కానున్న ఐఫోన్ 15 ప్రో ( iPhone 15 Pro ) కొత్త ఏ17 బయోనిక్ చిప్, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సిస్టమ్, పిల్-ఆకారపు కటౌట్‌తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంటుందని పుకారు ఉంది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌తో మొదటిసారిగా కలర్-కోఆర్డినేటెడ్ ఛార్జింగ్ కేబుల్‌లను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు.
Apple is expected to launch the iPhone 15 Pro and iPhone 15 Pro Max next month! Here are some of the major changes:
— Apple Hub (@theapplehub) August 23, 2023
Design updates
The new Pro models will feature some design changes, including a new Titanium body (replacing Stainless Steel) and the thinnest bezels on a… pic.twitter.com/dg8kDLNJdw
Comments
Please login to add a commentAdd a comment