నేడు దలాల్ స్ట్రీట్ కుదేలైంది. భల్లూకం పట్టు నుంచి బయటపడలేక మార్కెట్ విలవిల్లాడింది. దీంతో, స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంత అదే దొరణిలో కొనసాగాయి. స్మాల్, మీడియం, లార్జ్ క్యాప్ అని తేడా లేకుండా అన్ని విభాగాల్లో షేర్లు భారీగా నష్టపోయాయి. ఉక్రెయిన్ విషయంలో రష్యా & అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, ఒమిక్రాన్ విజృంభణ, ఫెడ్వడ్డీ రేట్ల పెంపు తప్పదనే సంకేతాలు దేశీయ మార్కెట్లను కోలుకోలేని దెబ్బతిశాయి. ఈ రోజు స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో ''బ్లాక్ మండే''గా నిలిచింది.
మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపడం వల్ల అన్ని రంగాల షేర్లు నష్టాలనే చవిచూశాయి. సిప్లా, ఓఎన్జీసీ షేర్లు మాత్రమే లాభాలను ఆర్జించాయి. చివరకు, సెన్సెక్స్ 1545 పాయింట్లు కోల్పోయి 57,491కి పడిపోయింది. నిఫ్టీ 468 పాయింట్లు(2.66 శాతం) నష్టపోయి 17,149 వద్ద స్థిర పడింది. ఒక్కరోజులోనే సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 3శాతం మేర క్షీణించాయి. దీంతో మదపర్ల సంపద రూ.10లక్షల కోట్లు ఆవిరైంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.62 వద్ద ఉంది.
నిఫ్టీలో జెఎస్ డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు ఎక్కువగా నష్టపోతే.. సిప్లా, ఓఎన్జీసీ షేర్లు మాత్రమే లాభాలను ఆర్జించాయి. అన్ని ఆటో, మెటల్, ఐటీ, పవర్, ఫార్మా, రియాల్టీ, ఎఫ్ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 2-6 శాతం పడిపోయి భారీ నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 4 శాతం పడిపోయాయి.
(చదవండి: ఎల్ఐసీ పాలసీ దారులకు శుభవార్త.. ఉచితంగా క్రెడిట్ కార్డులు!)
Comments
Please login to add a commentAdd a comment